Akhil Akkineni : ఇన్నావా.. ఇన్నావా.. కన్నెపిల్లేమందో..

Akhil Akkineni :  ఇన్నావా.. ఇన్నావా.. కన్నెపిల్లేమందో..
X

ఇన్నావా.. ఇన్నావా.. కన్నెపిల్లేమందో.. ఇన్నావా అంటోంది భాగ్యశ్రీ బోర్సే. తను హీరోయిన్ గా నటిస్తోన్న మూవీ లెనిన్ లోని పాట ఇది. లెనిన్ గా నటించేది అక్కినేని అఖిల్. ఈ ఇద్దరు కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. పాట సందర్భానుసారంగా వస్తోంది అనిపించేలా ఉంది. ‘ఇన్నావా.. ఇన్నావా.. కన్నెపిల్లేమందో.. ఉన్నావా ఉన్నావా భద్రంగా ఉన్నావా భూమ్మేదో ఉన్నావా’అంటూ సాగే పాట ఇది. ఆ వ్యక్తికి సంబంధించిన మాటలను పాటగా మార్చుకుని ఆ అమ్మాయే పాడుకున్న పాట ఇది. ఆ సందర్భంలో అతను కూడా పాటందుకుంటాడు.. ‘బంగారం బంగారం అంటూ నువ్వంటే బలే బాగుందే..’అంటాడు.

అయితే పాట మాత్రం వినగానే ఆకట్టుకునేలా లేదు. వినగా వినగా మాత్రం ఆకట్టుకుంటోంది అనిపిస్తోంది. అంటే సందర్భానుసారంగా వచ్చే పాటలు ఇలానే ఉంటాయి. ఒక జాతర్లో ఆ అమ్మాయి .. ఆ అబ్బాయికి చెప్పే సంగతులు అన్నట్టుగా ఉందీ పాట. థమన్ సంగీతం అందించాడు. థమన్ తో పాటు జుబిన్ నాటియాల్, శ్వేత మోహన్ కలిసి పాడారు. అనంత శ్రీరామ్ రాశాడు. నాగార్జున, నాగవంశీ కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు. మే 1న సినిమా విడుదల చేస్తాం అని ఈ పాటతో పాటు ప్రకటించింది టీమ్.

కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర్నుంచీ సరైన హిట్ పడలేదు అఖిల్ కు. ఈ మూవీ మాత్రం ఆ లోటును తీరుస్తుంది అనిపించేలా ఉంది. తిరుపతి నేపథ్యంలో సాగే కథ అని ముందు నుంచీ చెబుతున్నారు. అటు భాగ్యశ్రీకి సైతం హిట్ పడలేదు. ఈ ఇద్దరూ కలిసి ఓ బ్లాక్ బస్టర్ అందుకుంటారేమో చూడాలి.

Tags

Next Story