Telugu Bigg Boss Season 6: సినిమాలకు దూరంగా ఉన్న హీరో.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ

Telugu Bigg Boss Season 6: సినిమాలకు దూరంగా ఉన్న హీరో.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ
X
Telugu Bigg Boss Season 6: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6లోకి ఒకప్పటి హీరో వడ్డే నవీన్ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ అతడిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Telugu Bigg Boss Season 6: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6లోకి ఒకప్పటి హీరో వడ్డే నవీన్ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ అతడిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బుల్లి తెర మీద క్లిక్ అయినంతగా ఓటీటీలో బిగ్‌బాస్ షోని ప్రేక్షకులు ఆదరించలేకపోయారు.

త్వరలోనే సీజన్ 6తో బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు టీమ్ సన్నహాలు చేస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఆరో సీజన్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల వేట మొదలైంది.

సీజన్ సిక్స్‌లో పాల్గొనేది వీరేనంటూ కొంత మంది పేర్లు అప్పుడే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్‌లోకి తాజాగా నవీన్ వడ్డే వచ్చి చేరాడు. ఒకప్పుడు స్టార్ హీరో, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో నవీన్.. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు.. సినిమాల్లోనే కాదు, సినిమాలకు సంబంధించిన ఏ ఈవెంట్ కానీ, అసలు అతడికి సంబంధించిన వార్తలు కానీ లేవు.. కానీ సడెన్‌గా ఈ మధ్య అతడి పేరు వినిపిస్తోంది..


ఇప్పుడు బిగ్‌బాస్ లోకి నవీన్ ఎంట్రీ అంటూ మరికొన్ని వార్తలు. ఒకవేళ ఇదే నిజమైతే సినిమాల్లోకి కూడా అతడి రీ ఎంట్రీ ప్రారంభమైనట్లే అని నవీన్ అభిమానులు భావిస్తున్నారు.. నిజానికి నవీన్‌కి బిగ్‌బాస్‌కి రావడం ఇష్టం లేకపోయినా నిర్వాహకులు భారీ ఆఫర్ చేసి ఒప్పించారట. హౌస్‌లో అతడు స్పెషల్ అట్రాక్షన్ అవుతాడని బిగ్‌బాస్ టీమ్ ఆశిస్తోంది. ఇక నవీన్‌తో పాటు సీజన్ సిక్స్‌లో కనిపించే వారిలో జబర్థస్త్ కమెడియన్స్ ఆది, దీప్తి, వర్షిణి, యాంకర్ ధనుష్, ఓటీటీ కంటెస్టెంట్‌లు శివ, అనిల్, మిత్రాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

Tags

Next Story