Valimai Twitter Review: 'వలిమై' ట్విట్టర్ రివ్యూ: 'హాలీవుడ్ స్థాయి' లో యాక్షన్ సన్నివేశాలు..

Valimai Twitter Review: హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన వాలిమై మార్నింగ్ షోలను చూసిన అభిమానుల నుంచి సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ కనబరుస్తున్నారు. అజిత్ మరోసారి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అభిమానులు అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని లైక్ చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు 'హాలీవుడ్ స్థాయి' లో ఉన్నాయని కొందరు పేర్కొన్నారు. తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 95% కంటే ఎక్కువ వలిమై సినిమా టిక్కెట్లు 1వ రోజు అమ్ముడయ్యాయి. అజిత్-నటించిన ఈ చిత్రం.. రజనీకాంత్ 'దళపతి', విజయ్ నటించిన 'మాస్టర్' రికార్డ్ కలెక్షన్‌ను బద్దలు కొట్టగలదని సినీ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చిత్రంలో హుమా ఖురేషి, బని, సుమిత్ర, రాజ్ అయ్యప్ప, చైత్రారెడ్డి, పుగజ్, యోగి బాబు, ధ్రువన్ మరియు దినేష్ ప్రభాకర్ వంటి ప్రధాన తారాగణం ఉంది. కోలీవుడ్‌లో వాలిమై సినిమాతో అరంగేట్రం చేస్తున్న తెలుగు నటుడు కార్తికేయకు కూడా ఈ చిత్రం ద్వారా తమిళనాట మంచి గుర్తింపు వస్తుంది.
ట్విట్టర్ యూజర్లలో ఒకరు ఫస్టాఫ్ పూర్తయింది. కోలీవుడ్ సినిమా నెక్స్ట్ లెవల్‌కి వెళుతోంది. ప్రతి సన్నివేశం చాలా సస్పెన్స్. అజిత్, కార్తికేయ బైక్ ఛేజింగ్ సీన్ టెర్రిఫిక్. మరో నెటిజన్ కూడా "అజిత్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ & ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్ గూస్ బంప్స్ తెప్పించాయని ప్రశంసించారు.
థియేటర్స్ బయట అజిత్ అభిమానులు సినిమా బ్యానర్‌కు పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సినిమా హాళ్ల వెలుపల బైకర్లు విన్యాసాలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నందున అజిత్ కుమార్ సినిమాలు పాన్-ఇండియా సినిమాలు కానున్నాయి. అందుకు వాలిమై నాంది పలుకుతుంది అని బోనీ అన్నారు. ఈ చిత్రంలో ఎమోషనల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, అత్యద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, అజిత్ నటన అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు.
#Valimai 💪 1st Half over..
— Thala Bakthan Msp (@msp_thala) February 24, 2022
Kollywood Cinema going to Next Level
Each and Every scene very suspense..
Mass Intervel block. #Thala and Karthikeya Bike chasing scene Mass Terrific.. All are EnjoyNanga vera mari song .. Thala.Thala.. #ValimaiReview #ValimaiThePower #Ajithkumar𓃵 pic.twitter.com/rqNnch17fX
Done with 1st half : one word Verithanam🔥💥 Worth the wait #AjithKumar screen presence & pre interval fight scene Goosebumps moment for every fans..
— Vidya Theatre RGB Dolby Atmos (@vidyaRGB) February 24, 2022
Waiting to watch more on 2nd half#HVinoth 💥#Valimai #ValimaiStorm #ValimaiAtVidya #Ajithkumar𓃵 pic.twitter.com/jgf4Ht0VTM
#Ajith sir's presence all the way!!💪🏽❤ Top notch action especially the bike stunts...👏🏽A need of the hour message in the end... A big treat to all the fans...🤗
— ArunVijay (@arunvijayno1) February 24, 2022
Kudos to the team..👍🏽#Valimai
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com