Valimai vs Bheemla Nayak : భీమ్లానాయక్ ని బీట్ చేసిన అజిత్ వలిమై

Valimai vs Bheemla Nayak : భీమ్లానాయక్ ని బీట్ చేసిన అజిత్ వలిమై
X
Valimai vs Bheemla Nayak : హెచ్ వినోద్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ డ్రామా 'వలిమై'

Valimai vs Bheemla Nayak : హెచ్ వినోద్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ డ్రామా 'వలిమై'... ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌‌గా రిలీజై ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. రొటీన్ డ్రగ్స్ మాఫియా కథనే తీసుకుని.. దానికి హై రేంజ్ యాక్షన్ సీక్వెన్సులు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వినోద్.. తెలుగు యంగ్ హీరో కార్తికేయ ఇందులో విలన్‌‌గా నటించగా, హ్యూమా ఖురేషి హీరోయిన్‌‌గా నటించింది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించిన ఈ మూవీని జీ స్టూడియోస్‌ సంస్థతో కలిసి బోనీ కపూర్‌ నిర్మించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌ నటించిన భీమ్లానాయక్ సినిమాకి పోటీగా(ఒక్క రోజు ముందుగా రిలీజై) వచ్చిన ఈ మూవీ.. తెలుగులో కూడా మంచి వసూళ్ళను సాధిస్తోంది. ప్రముఖ సినీ విశ్లేషకుడు మనోబాల విజయబాలన్ ప్రపంచవ్యాప్తంగా భీమ్లానాయక్ మరియు వలిమై సినిమాల 12 రోజుల కలెక్షన్ లను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా వలిమై బాక్స్‌‌ఆఫీస్ వద్ద 12 రోజుల కలెక్షన్ లను పరిశీలిస్తే రూ. 215.63 కోట్లను కొల్లగొట్టింది. ఇక పవన్ భీమ్లానాయక్ 12 రోజుల కలెక్షన్ లను చూస్తే మొత్తం రూ. 184.42 కోట్లని సాధించింది. ఈ లెక్క ప్రకారం పవన్ భీమ్లానాయక్ ని వరల్డ్ వైడ్ గా వలిమై బీట్ చేసిందనే చెప్పాలి.

అయితే వలిమై పాన్ ఇండియా మూవీ కావడం విశేషం కాగా, భీమ్లానాయక్ ఒక్క తెలుగులోనే రిలీజైంది.


Tags

Next Story