Vani Jayaram Demise: వాణి జయరాం మృతి పట్ల అనుమానాలు.. కేసు నమోదు

Vani Jayaram Demise: వాణి జయరాం మృతి పట్ల అనుమానాలు.. కేసు నమోదు
X
గాజు టేబుల్ పై పడడంతో ముఖానికి గాయాలైనట్లు తెలుస్తోంది

ప్రముఖ గాయణి వాణి జయరాం మృతి పట్ల అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆమెది సహజ మరణం కాదని తెలుస్తోంది. ముఖంపై గాయాలున్నట్లు డాక్టర్లు గుర్తించారు. పనిమనిషి ఇచ్చిన సమాచారం ప్రకారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాజు టేబుల్ పై పడడంతో ముఖానికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఉదయం పనిమనిషి వెళ్లి డోర్ కొట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూడగా జయరాం రక్తపు మడుగులో పడిఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Tags

Next Story