Vani Jayaram: వాణీ జయరాం మరణం వెనుక వీడిన మిస్టరీ

Vani Jayaram: నుంగంబాక్కమ్‌లోని తన ఇంట్లో శనివారం శవమై కనిపించిన గాయని వాణీ జయరామ్ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తేల్చిచెప్పారు. గాయని ప్రమాదవశాత్తు కిందపడి మరణించినట్లు ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక సూచించింది.
ఆమె మృతి అనుమానాస్పందంగా ఉందని మొదట తేల్చిన పోలీసులు, పోస్ట్ మార్టం అనంతరం అందులో వాస్తవాలు లేవని నిర్ధారించారు. ఆమె మరణించే సమయంలో ఒంటరిగా ఉంది. తలుపు లోపల నుండి లాక్ చేయబడింది. పోలీసులు ఆమె ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లు కూడా లేవని చెప్పారు. శనివారం వాణి జయరామ్ భౌతికకాయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు
శనివారం ఉదయం ఇంటి పనిమనిషి వాణి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అప్రమత్తమైంది. తలుపు తెరిచిన తర్వాత, ఆమె నుదిటిపై గాయంతో కనిపించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సెక్షన్ 174 (అసహజ మరణం) కింద కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com