Karthika Deepam: వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్లు ఇక ఉండవు..

Karthika Deepam: ఎంటర్‌టైన్మెంట్‌లో సినిమాలకే కాదు.. సీరియళ్లకు కూడా సమాన స్థానం ఉంది. ముఖ్యంగా ఈకాలంలో సీరియళ్లకు ఉన్న డిమాండ్.. ఇంక దేనికీ లేదు. ఎన్ని కొత్త ఎంటర్‌టైన్మెంట్ సోర్స్‌లు వచ్చినా.. సీరియళ్లకు ఉండే స్థానం మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు. అందులోనూ 'కార్తీక దీపం' ప్లేస్ అయితే ఎప్పుడూ టాపే. అయితే తాజాగా ఈ సీరియల్ నుండి ఓ షాకింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
తెలుగు బుల్లితెరపై 'కార్తీక దీపం' క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.. వంటలక్క, డాక్టర్ బాబు అంటే ఒక ఎమోషన్‌లాగా అయిపోయింది. ఈ ఇద్దరు నటులు ఈ సీరియల్‌తోనే పాపులర్ అయ్యారు కూడా. అయితే మామూలుగా సీరియల్స్ అంటే ఒక జెనరేషన్ నుండి మరో జెనరేషన్ మారుతూ ఉంటుంది. అయితే కార్తీక దీపం కూడా ఇప్పుడు అదే స్టేజ్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది.
కార్తీక దీపం నాలుగేళ్ల క్రితం ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఈ సీరియల్‌ను ముందుండి నడిపించిన డాక్టర్ బాబు, వంటలక్క ఇకపై ప్రేక్షకులు కనిపించరు. ఇప్పటికే సీరియల్‌లో వంటలక్క క్యారెక్టర్ ఎప్పుడో చనిపోవాల్సింది. కానీ అలా చేస్తే.. సీరియల్ ముందుకు వెళ్లదు అని అనుకున్న దర్శకుడు ఇప్పటివరకు ఆ క్యారెక్టర్‌ను అలాగే ఉంచి.. తనతో పాటు ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులను ప్రేక్షకులకు అలవాటు చేశాడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేకుండా చైల్డ్ ఆర్టిస్టులనే లీడ్ రోల్స్‌లో చూపించనున్నాడు.
కార్తీక దీపంలో డాక్టర్ బాబు, వంటలక్క క్యారెక్టర్లను రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయినట్టు చూపించాడు దర్శకుడు. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత ఇంక వారు సీరియల్‌లో కనిపించబోరని డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. 'మీరు ఎంత ఫీల్ అవుతున్నారో.. అంతే మేము కూడా. అది మనందరికీ ఒక ఎమోషన్' అంటూ సీరియల్ టీమ్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు. అయితే ఈ రెండు క్యారెక్టర్ల వల్ల సీరియల్ నిలబడిందని, వారు లేకపోతే ఇంకెవరు చూస్తారని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com