సినిమా

Varalakshmi sarathkumar : బాలయ్య సినిమాలో జయమ్మ.. ఇక తగ్గేదేలే..!

Varalakshmi sarathkumar : హీరోయిన్‌‌గా కంటే స్కోప్ ఉన్న పాత్రలనే చేసేందుకే ఎక్కువగా ఇష్టపడుతోంది నటి వరలక్ష్మి శరత్‌‌కుమార్..

Varalakshmi sarathkumar : బాలయ్య సినిమాలో జయమ్మ.. ఇక తగ్గేదేలే..!
X

varalakshmi sarathkumar : హీరోయిన్‌‌గా కంటే స్కోప్ ఉన్న పాత్రలనే చేసేందుకే ఎక్కువగా ఇష్టపడుతోంది నటి వరలక్ష్మి శరత్‌‌కుమార్.. రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మగా అదరగొట్టిన ఆమెకి.. అల్లరి నరేష్ నాంది మూవీ మరింత పేరును తీసుకొచ్చింది. ఇప్పుడామెకి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. జైబాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌‌‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మేరకు మేకర్స్ కొద్దిసేపటి క్రితమే ఆఫీషియల్‌‌‌గా అనౌన్స్ చేశారు. క్రాక్ సినిమాలో జయమ్మ లాగే ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర చాలా పవర్ఫుల్‌‌గా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌‌‌గా లాంచ్ అయిన మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.


Next Story

RELATED STORIES