VARANASI Movie : మెక్సికోలో వారణాసి ఫస్ట్ గ్లింప్స్

VARANASI Movie :  మెక్సికోలో వారణాసి ఫస్ట్ గ్లింప్స్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న మూవీ వారణాసి. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ పై అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని అంచనాలున్నాయి. మహేష్ బాబు ఫస్ట్ టైమ్ చేస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగు వాళ్లు కూడా క్రేజీగా చూస్తున్నారు. అఫ్ కోర్స్ రాజమౌళి కూడా తెలుగువాడే కదా అనుకుంటున్నారేమో. బట్ అతనెప్పుడో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయాడు. ఇక ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయడానికి హైదరాబాద్ ను ఎంచుకున్నాడు జక్కన్న. ఈ సారి ఫస్ట్ గ్లింప్స్ అంటూ మెక్సికోలో విడుదల చేయబోతున్నాడు.

కామిక్ కాన్ ఎక్స్ పీరియన్స్ ను ఈ గ్లింప్స్ తో అందించబోతున్నారు. ఈ నెల 24న ఈ గ్లింప్స్ ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో విడుదల చేయబోతున్నారు. విశేషం ఏంటంటే.. ఈ గ్లింప్స్ కోసం మహేష్ బాబు స్వయంగా రావడం లేదు. ప్రస్తుతం అతను అంటార్కిటికాలో ఈ మూవీ షూటింగ్ చేస్తున్నాడు. అక్కడి నుంచే తన వీడియోతో సందేశం పంపించబోతున్నాడు. దీంతో పాటు ఆ లైవ్ లోనే ఆడియన్స్ తో ఇంటరాక్షన్ చేయబోతున్నాడు. ఏదేమైనా ఈ గ్లింప్స్ తో ఇంటర్నేషనల్ రేంజ్ నుంచి ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది వారణాసి అనిపించేలా ఉంది.

ఇక ఈ మూవీలో మహేష్ బాబు కమర్షియల్ రోల్ లో చూపించడంతో పాటు రాముడుగానూ చూపించబోతున్నాడు రాజమౌళి. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారణాసి చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు.

Tags

Next Story