Varsha Bollamma: 'నాకు పెళ్లయ్యింది కానీ..': వర్ష బొల్లమ్మ

Varsha Bollamma (tv5news.in)
Varsha Bollamma: తెలుగు ప్రేక్షకులు నాజుగ్గా ఉన్న అమ్మాయిలకంటే బొద్దుగా ఉన్నవారినే ఎక్కువగా ఇష్టపడతారు. ఈ విషయం స్పష్టం అయ్యేలా ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్లు టాలీవుడ్‌లో హవా కొనసాగించారు. కానీ ఈకాలంలో అలాంటి హీరోయిన్ల సంఖ్య తగ్గిపోయింది. ఆ లిస్ట్‌లో ఒకరు వర్ష బొల్లమ్మ. ఇటీవల తన అప్‌కమింగ్ సినిమా 'స్టాండప్ రాహుల్' ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న వర్ష.. తన పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
'96' సినిమాలో చిన్న పాత్రతో ఫేమస్ అయిపోయింది వర్ష బొల్లమ్మ. ఆ చిన్న పాత్ర తనకు ఎన్నో అవకాశాలు సంపాదించి పెట్టింది కూడా. ప్రస్తుతం తనకు తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా పలు అవకాశాలు కూడా వస్తున్నాయి. అలాగే రాజ్ తరుణ్‌తో 'స్టాండప్ రాహుల్' అనే చిత్రంలో నటిస్తోంది వర్ష. ఈ మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో హీరోతో కలిసి ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీగా ఉంది.
ఇటీవల ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న వర్ష.. తన గురించి గూగుల్‌లో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఇదే క్రమంలో తనకు పెళ్లి అయ్యిందా, తను ప్రెగ్నెంటా అనే ప్రశ్నలు కూడా తనకు ఎదురయ్యాయి. అయితే ఈ ప్రశ్నకు వర్ష కాస్త ఇబ్బంది పడడంతో పాటు ఘాటుగా సమాధానం కూడా ఇచ్చింది.
'నాకు పెళ్లైతే ఏంటీ? కాకపోతే ఏంటీ?' అంటూ వర్ష బొల్లమ్మ నెటిజన్లపై ఫైర్ అయ్యారు. తనకు పెళ్లయ్యింది అని కానీ నిజంగా కాకుండా సినిమాల్లో అయ్యిందని వర్ష చమత్కారం చేసింది. అంతే కాకుండా తన బుగ్గలు పెద్దగా ఉండడం వల్లే ప్రెగ్నెంట్ అన్న రూమర్స్ వస్తూ ఉంటాయని చెప్పుకొచ్చింది. చీక్స్ కాస్త లావుగా ఉంటే పెళ్లయ్యింది, ప్రెగ్నెంట్ అయ్యింది అని ఫిక్స్ అయిపోతారా అని ప్రశ్నించింది వర్ష.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com