బన్నీ చెల్లెలుగా ఈ మిడిల్ క్లాస్ మెలోడి భామ..

బన్నీ చెల్లెలుగా ఈ మిడిల్ క్లాస్ మెలోడి భామ..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడు మిల్లి ఫారెస్టులో జరుగుతోంది. చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుందని.. ఇందుకోసం బన్నీ చెల్లెలుగా నటించేందుకు మొదట ఐశ్వర్య రాజేష్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా మిడిల్ క్లాస్ మెలోడీస్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమెను తీసుకున్నారనే విషయంలోనూ క్లారిటీ రావలసి ఉంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తోంది చిత్ర యూనిట్.

Tags

Next Story