Varun Sandesh: పాన్ ఇండియా సినిమాలో 'హ్యాపీ డేస్' హీరో..

Varun Sandesh (tv5news.in)
Varun Sandesh: ఇటీవల సినీ పరిశ్రమలో పాన్ ఇండియా చిత్రాలే ఎక్కువయిపోయాయి. భాషా భేదాలు లేకుండా ప్రేక్షకులు మంచి కంటెంట్‌ను ఆదరిస్తూ ఉండడంతో మేకర్స్ కూడా తమ కథను అన్ని భాషల ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా సినిమాలకు క్రేజ్ రావాలన్నా యాక్టర్లు కూడా అంతే క్రేజ్ ఉన్నవారు అయ్యిండాలి. అయితే దీనికి భిన్నంగా ఓ పాన్ ఇండియా సినిమాలో ఫేడవుట్ అయిన హీరోకు ఛాన్స్ ఇచ్చింది మూవీ టీమ్.
టాలీవుడ్ డైరెక్టర్స్‌లో శేఖర్ కమ్ములకు చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ దర్శకుడు ఇతరులలాగా ఎక్కువగా స్టార్ల వెనుక పరిగెత్తడు. కొత్త ఫేసేస్‌తో సూపర్ హిట్ కొట్టగల స్టామినా శేఖర్ కమ్ముల. అలా శేఖర్ కమ్ముల పరిచయం చేసిన ఎంతోమంది నటీనటులు ప్రస్తుతం టాలీవుడ్‌లో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. కానీ వారిలో కూడా కెరీర్‌ను నిలబెట్టుకోలేక ఫేడవుట్ అయినవారు ఉన్నారు. అందులో ఒకడు వరుణ్ సందేశ్.
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'హ్యాపీ డేస్' చిత్రంతో ఎంతోమంది నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అందులో ఒకడు వరుణ్ సందేశ్. అందరితో పాటే వరుణ్ సందేశ్‌కు కూడా ఈ సినిమా ద్వారా చాలా క్రేజ్ వచ్చింది. కానీ ఆ క్రేజ్‌ను తను ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయాడు. కొన్నా్ళ్లకే సినిమాలకు పూర్తిగా దూరమయిపోయాడు. మళ్లీ బిగ్ బాస్‌తో లైమ్ లైట్‌లోకి వచ్చిన వరుణ్ సందేశ్.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా చిత్రంలోనే ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Team #MICHAEL👊welcomes the multi faceted actor @itsvarunsandesh
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) March 12, 2022
on board 🎬
Regular shoot taking off on a brisk pace💥💥 @sundeepkishan @VijaySethuOffl @menongautham @varusarath5@itsdivyanshak @jeranjit @SVCLLP @KaranCoffl
మైఖేల్ மைக்கேல் माइकल ಮೈಕೆಲ್ മൈക്കിൾ pic.twitter.com/SfY8UqqEA3
బిగ్ బాస్ సీజన్ 3లో తన భార్యతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ సందేశ్. దీంతో తనకు మళ్లీ సినిమా ఆఫర్లు మొదలయ్యాయి. ఇటీవల తాను నటించిన 'ఇందువదన' కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా సందీప్ కిషన్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ 'మైఖేల్'లో వరుణ్ కీలక పాత్ర కోసం ఎంపికయినట్టు మూవీ టీమ్ ప్రకటించింది. వరుణ్ సందేశ్‌కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అని అనుకుంటున్నారు అభిమానులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com