Varun Tej: 'మేము అనుకున్నట్టు జరగలేదు'.. ఓటమిని ఒప్పుకుంటూ వరుణ్ తేజ్ లేఖ..

Varun Tej: చాలాకాలంగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న మెగా హీరోల్లో వరుణ్ తేజ్. ఈ హీరో స్టోరీ సెలక్షన్, యాక్టింగ్‌కు ఇప్పటికీ ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కథ నచ్చితే.. దానికోసం ఎంత అయినా కష్టపడే గుణం ఉన్నవాడే వరుణ్ తేజ్. అందుకే 'గని' సినిమాలో బాక్సర్‌గా కనిపించడానికి చాలా కష్టపడ్డాడు. కానీ ఆ సినిమా రిజల్ట్ మాత్రం రివర్స్ అయ్యింది. దీనిపై వరుణ్ తేజ్ తాజాగా స్పందించాడు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చిత్రమే 'గని'. ఈ సినిమా నాలుగేళ్ల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించుకుంది. కానీ మధ్యలో చాలా బ్రేకులు రావడంతో షూటింగ్ ఆలస్యమయ్యింది. షూటింగ్ పూర్తయిన తర్వాత గని రిలీజ్ చేయడానికి ఓ కరెక్ట్ డేట్ దొరకక ఇబ్బంది పడ్డారు మేకర్స్. ఫైనల్‌గా ఇటీవల గని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మూవీ టీమ్ ఆశించినంత స్పందన గనికి లభించలేదు.
'ఇన్నాళ్లుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి నాకు చాలా సంతోషంగా ఉంది. గని మేకింగ్‌లో పాత్రులైన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. మీరు, ముఖ్యంగా నిర్మాతలు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. దానికి చాలా థాంక్యూ. మేము మీకు ఒక మంచి సినిమాను అందించాలన్న ఉద్దేశ్యంతో చాలా కష్టపడ్డాం. కానీ అది అనుకున్నట్టు జరగలేదు. నేను ఏ సినిమా చేసినా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే చేస్తాను. కొన్నిసార్లు నేను గెలుస్తాను. కొన్నిసార్లు నేను నేర్చుకుంటాను. కానీ కష్టపడడం మాత్రం ఆపను.' అంటూ గని ఫెయిల్యూర్‌ను ఒప్పుకుంటూ ట్వీట్ చేశాడు వరుణ్ తేజ్.
— Varun Tej Konidela (@IAmVarunTej) April 12, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com