సినిమా

Varun Tej: బన్నీ పుట్టినరోజున వరుణ్ తేజ్ గిఫ్ట్.. ఫైనల్‌గా..

Varun Tej: డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రమే ‘గని’.

Varun Tej: బన్నీ పుట్టినరోజున వరుణ్ తేజ్ గిఫ్ట్.. ఫైనల్‌గా..
X

Varun Tej: ప్రస్తుతం మెగా హీరోలంతా ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు సినిమాలను విడుదల చేస్తూ హిట్‌లను అందుకుంటున్నారు కూడా. కానీ వారిలో కూడా కొందరు సినిమాల విడుదల తేదీల్లో ఇంకా సతమతపడుతూనే ఉన్నారు. అందులో ఒకరు వరుణ్ తేజ్. అయితే వరుణ్ తేజ్ ఫైనల్‌గా తన అప్‌కమింగ్ మూవీ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇది బన్నీకి మంచి బర్త్‌డే గిఫ్ట్ అవుతుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.


డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రమే 'గని'. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. బాక్సర్ పాత్ర కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు కూడా. ఆ క్యారెక్టర్ కోసం తగిన ఫిజిక్‌ను మెయింటేయిన్ చేయడానికి వరుణ్ క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లాడు. అప్పట్లో తన వర్కవుట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

గని సినిమా అనౌన్స్‌మెంట్ ఏ టైమ్‌కు వచ్చిందో కానీ.. ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ చేయడానికి ఒక సరైన విడుదల తేదీ దొరకడం లేదు మూవీ టీమ్‌కు. గతేడాదే గని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో మెల్లగా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇప్పటికే ఎన్నో విడుదల తేదీలతో గని సినిమా పోస్టర్లు విడుదలయ్యాయి. కానీ ఇన్నాళ్లకు ఫైనల్‌గా మరో విడుదల తేదీని అనౌన్స్ చేసింది గని టీమ్.


ఏప్రిల్ 8.. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గని సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని గని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం వారానికి కనీసం ఒక్క పాన్ ఇండియా సినిమా అయినా విడుదలకు సిద్ధమవుతోంది. కాబట్టి ఏప్రిల్ అయితే కాంపిటీషన్ కాస్త తక్కువగా ఉంటుందన్న ఆలోచనతో గనిని అప్పుడు రిలీజ్ చేస్తున్నారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES