Varun Tej: 'చరణ్ అన్నను ఎవరైనా ఏమైనా అంటే..': వరుణ్ తేజ్ స్ట్రాంగ్ వార్నింగ్

Varun Tej: 'ఆర్ఆర్ఆర్' సినిమా వల్ల ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఎన్‌టీఆర్, రామ్ చరణ్ పేర్లే వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఇద్దరు హీరోలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. వారితో పాటు వారి అభిమానులు కూడా ఆర్ఆర్ఆర్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రామ్ చరణ్ పుట్టినరోజు రావడంతో అభిమానులంతా శిల్పకళావేదికలో సెలబ్రేషన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నాడు.
హీరోలపై అభిమానులు చూపించే ప్రేమకు హద్దులు ఉండవు. అందుకే రామ్ చరణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను చాలా గ్రాండ్‌గా ప్లా్న్ చేశారు అభిమానులు. ఈ సెలబ్రేషన్స్‌కు వరుణ్ తేజ్, మెహర్ రమేష్, బాబీ, చిరంజీవి సోదరి మాధవి, జానీ మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ స్టేజ్‌పై ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో వరుణ్ తేజ్ స్టేజ్‌పై తనకు చరణ్‌తో జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నప్పుడు చరణ్.. తనను బాగా కొట్టేవాడన్న విషయాన్ని బయటపెట్టాడు. అయితే చిరుత సినిమా తర్వాత రామ్ చరణ్‌లో మెచ్యురిటీ వచ్చిందన్నాడు వరుణ్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ.. స్క్రీన్‌పై చరణ్‌ను చూస్తున్నట్టు అనిపించలేదని, అల్లూరి సీతారామరాజును చూస్తున్నట్టు అనిపించదని అన్నాడు.
చివరిగా వరుణ్ తేజ్.. చరణ్ అన్నను ఎవరైనా నోరెత్తి ఏమైనా అనాలంటే అభిమానులతో పాటు తాను అక్కడే ఉంటానని చెప్పాడు. ముందు తమరితో ఎవరైనా ఏమైనా మాట్లాడిన తర్వాతే చరణ్ అన్నతో మాట్లాడాలి అంటూ ఎవరికో పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ వరుణ్ తేజ్ ఎందుకు అలా అన్నాడు. దీని వెనుక ఏదైనా ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉందా లేక తాను కూడా చరణ్‌కు ఒక ఫ్యాన్ అని తెలపడానికి ఇలా చేశాడా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com