ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం

X
By - Vijayanand |10 Jun 2023 10:30 AM IST
వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకను అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో హైదరాబాద్‌లోని నాగబాబు స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిరంజీవి, అల్లు అరవింద్, లావణ్య కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని తెలిసింది. వరుణ్ - లావణ్య పెళ్లికి మరో రెండు నెలల సమయం ఉందని సమాచారం. ఇటలీలో ఈ వేడుక జరగనుందని ప్రచారం వినిపిస్తోంది. త్వరలో పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. వరుణ్ - లావణ్య ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ అనే సినిమాతో పాటు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. అలాగే కరుణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ డ్రామా సినిమా చేయనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com