సినిమా

Varun Tej: పెళ్లిపై వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Varun Tej: గని ప్రమోషన్స్ సమయంలో పెళ్లి గురించి ప్రశ్నను ఎదుర్కున్నాడు వరుణ్ తేజ్.

Varun Tej (tv5news.in)
X

Varun Tej (tv5news.in)

Varun Tej: వరుణ్ తేజ్ తాజాగా 'గని' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి మంచి టాక్‌నే సంపాదించుకుంటోంది. అయితే టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో వరుణ్ తేజ్ ఒకడు. అందుకే మెగా అభిమానులు వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడా అని ఎదురుచూస్తు్న్నారు. ఇటీవల గని ప్రమోషన్స్ సమయంలో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వరుణ్ తేజ్.

వరుణ్ తేజ్ హీరోగా పరిచయమయిన దగ్గర నుండి తన యాక్టింగ్‌తో సినిమాలకు మినిమమ్ సక్సెస్ తెచ్చిపెట్టడంతో పాటు మంచి మార్కెట్‌ను కూడా సంపాదించుకున్నాడు. కానీ తన కెరీర్‌లో మొదటిసారి మూడేళ్ల గ్యాప్ తీసుకున్నాడు వరుణ్ తేజ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గద్దలకొండ గణేష్' 2019లో విడుదలయ్యింది. మళ్లీ మూడేళ్ల తర్వాత గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్.

గని సినిమా ప్రీ ప్రొడక్షన్ నాలుగేళ్ల క్రితమే మొదలయ్యిందట. ఆ వెంటనే షూటింగ్ కూడా ప్రారంభించింది మూవీ టీమ్. గతేడాదే గని షూటింగ్ పూర్తయినా కూడా కోవిడ్ వల్ల విడుదల తేదీ దొరకలేదు. గని సినిమా రిలీజ్ చాలాసార్లే పోస్ట్‌పాన్ అయ్యి చివరికి ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది.

గని ప్రమోషన్స్ సమయంలో పెళ్లి గురించి ప్రశ్నను ఎదుర్కున్నాడు వరుణ్ తేజ్. దానికి సమాధానం.. తాను ఈ సంవత్సరం చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నానని, ఈ ఏడాది పెళ్లంటే కుదరదని అన్నాడు. ఇంతకు ముందు కూడా వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుణ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా తనకు ఏం అభ్యంతరం లేదు అన్నాడు నాగబాబు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES