Varun Tej : అప్పుడే ఓటిటలోకి మట్కా
వరుణ్ తేజ్ మట్కా మూవీతో మరో డిజాస్టర్ చూశాడు. రిలీజ్ కు ముందు కాస్త హోప్స్ ఇచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని.. వీకెండ్ లోనే వాష్ అవుట్ అయింది. కేవలం 70లక్షల ఓపెనింగ్ తో మొదలై 2- 2.5 కోట్ల మధ్య ఆగిపోయింది. ఈ మూవీతో నిర్మాతలు ఏకంగా 15 కోట్లకు పైగా నష్టాన్ని చూశారు. కరుణ కుమార్ డైరక్ట్ చేసిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.
విడుదలై నెల కూడా కాకుండానే అప్పుడే ఓటిటిలోకి వచ్చేస్తోంది మట్కా. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. మట్కా అనే జూదాన్ని దేశం మొత్తానికి పరిచయం చేసిన వాసు అనే వ్యక్తి కథగా వచ్చిన ఈ చిత్రం ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయిందనే టాక్ తెచ్చుకుంది. చాలా నీరసంగా సాగే స్క్రీన్ ప్లే.. ఏ మాత్రం ఎగ్జైటింగ్ గా లేని సన్నివేశాలతో ఆసాంతం బోర్ కొట్టింది అన్నారు ఆడియన్సెస్. కాకపోతే థియేటర్స్ లో పోయిన సినిమాలు ఓటిటి ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరి మట్కాకు కనీసం ఓటిటిలో అయినా ఆదరణ ఉంటుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com