Varun Tej 'Matka' : నవంబర్ 14న వరుణ్ తేజ్ మట్కా విడుదల

Varun Tej Matka : నవంబర్ 14న వరుణ్ తేజ్ మట్కా విడుదల
X

మెగా హీరో వరుణ్ తేజ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ మట్కా. కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, వరుణ్ తేజ్ లుక్ కి మంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారు మేకర్స్. మట్కా సినిమాను నవంబర్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి.

Tags

Next Story