Matka vs Kanguva : వరుణ్ తేజ్ 'మట్కా' vs సూర్య 'కంగువా'!

Matka vs Kanguva : వరుణ్ తేజ్ మట్కా vs సూర్య కంగువా!

తెలుగు సినీ ప్రేక్షకులకు నవంబర్ 14 తేదీ చాలా ముఖ్యమైన రోజుగా మారబోతోంది. ఎందుకంటే ఈ రోజే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'మట్కా' మరియు సూర్య నటించిన 'కంగువా' సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల విడుదల తేదీ ఒకటే కావడంతో బాక్సాఫీస్ వద్ద ఉత్కంఠ భరిత పోటీ నెలకొంది.

వరుణ్ తేజ్ గత కొన్ని సినిమాలతో అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో 'మట్కా' సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. గ్యాంబ్లింగ్‌, బెట్టింగ్‌ ఆట చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. వరుణ్ తేజ్ ఈ సినిమాలో విభిన్న గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

సూర్య నటించిన 'కంగువా'పై ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలున్నాయి. అసలు దసరా కానుకగా అక్టోబర్ 10న రావాల్సిన 'కంగువ'.. రజనీకాంత్ 'వెట్టయాన్' కోసం వాయిదా పడింది. ఇటీవలే 'కంగువా' చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మొత్తంమీద.. నవంబర్ 14న సూర్య 'కంగువా'తో వరుణ్ తేజ్ 'మట్కా' పోటీ పడబోతుంది.

Tags

Next Story