Vijay Devarakonda : విజయ్ దేవరకొండ టీజర్ వచ్చేస్తోందా..?

టాలెంటెడ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న సినిమా టీజర్ రెడీ అవుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. 'వి.డి 12' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీని మార్చి 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ రెండు భాగాలుగా రాబోతోన్న సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కాకపోతే రెండు భాగాలైనా.. ఫస్ట్ పార్ట్ కు సెకండ్ పార్ట్ కు కథా పరంగా పెద్ద తేడాలేం ఉండవని చెప్పాడు నిర్మాత నాగవంశీ. సో.. ఫస్ట్ పార్ట్ ఎప్పుడు వచ్చినా బిగ్గెస్ట్ హిట్ గ్యారెంటీ అన్నాడు.
ఇక ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే ఈ ఫిబ్రవరి 7న టీజర్ రిలీజ్ చేయబోతున్నారట. టీజర్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని టాక్. నిజానికి టైటిల్ లేకుండా కేవలం టీజర్ అంటే కూడా పెద్దగా కిక్ ఉండదు. టైటిల్ తెలిస్తే ఆ టైటిల్ కు టీజర్ కు లింక్ కరెక్ట్ గా సెట్ అయితే ఎక్స్ పెక్టేషన్స్ స్టార్ట్ అవుతాయి. అసలే విజయ్ కొన్నాళ్లుగా ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఆకలిగా ఎదురుచూస్తున్నాడు. ఈ మూవీ అతని వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పెడుతుందంటున్నారు. ఏదేమైనా టీజర్ తోనే ఓ హై ఫీలింగ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. చూద్దాం. మరి విజయ్ అండ్ గౌతమ్ కలిసి ఎలాంటి కంటెంట్ తో మెప్పిస్తారో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com