Vijay Devarakonda : రాజు కోసం కిరీటం ఎదురుచూస్తోంది

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది. ఈ అప్డేట్ కోసం అతని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అప్డేట్స్ కావాలి అంటూ నిర్మాణ సంస్థను బూతులు కూడా తిడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని రోజులుగా ఈ మూవీ టీజర్ ను ఈ నెల 7న విడుదల చేస్తారు అనే ప్రచారం జరిగింది. తర్వాత వేలైంటైన్స్ డే వస్తుందనే న్యూస్ కూడా వచ్చాయి. ఇవన్నీ కాదు అని ఫైనల్ గా అసలు డేట్ ను ప్రొడక్షన్ హౌసే ప్రకటించింది.
ఈ నెల 12న విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ తో పాటు టీజర్ ను కూడా ప్రకటించబోతున్నాం అని అఫీషియల్ అనౌన్స్ చేశారు. దీంతో పాటు ‘ఒక నిశ్శబ్ధ కిరీటం రాజు కోసం ఎదురు చూస్తోంది’ అనే క్యాప్షన్ ను కూడా జోడించారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఆ కిరీటంతో పాటు దట్టమైన చీకట్లను చీలుస్తున్నట్టుగా మంటలు చెలరేగుతూ ఉన్నాయి.
ఈ మూవీలో విజయ్ దేవరకొండ ‘స్పై’గా నటిస్తున్నాడు అనే ప్రచారం ఉంది. అది నిజమా కాదా అనేది ఈ టీజర్ తో తేలిపోతుంది. ఇక సినిమాను మే 30న విడుదల చేయబోతున్నారు. మొదట మార్చి 28 అనుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉండటంతో పాటు ఆ డేట్ కు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వస్తోంది కాబట్టి మే 30కి పోస్ట్ పోన్ చేశారు. సో.. 12న రౌడీ ఫ్యాన్స్ కు పండగే అన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com