Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వస్తే విజయ్ దేవరకొండకి కష్టం

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ వస్తే విజయ్ దేవరకొండకి కష్టం
X

విజయ్ దేవరకొండ కొన్నాళ్లుగా వరుసగా ఫ్లాప్స్ చూస్తున్నాడు. ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఫ్లాపులు వస్తున్నా.. అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే ఓ మంచి హిట్ పడితే తిరిగి ఫామ్ లోకి వస్తాడు అనుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. ఇది అతనికి 12వ మూవీ. అందుకే వి.డి 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్ అంతా ష్యూర్ షాట్ అనుకుంటున్నారు. గౌతమ్ కూడా మళ్లీరావా, జెర్సీ మూవీస్ తో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు నిర్మాత నాగవంశీ.

విజయ్ - గౌతమ్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా రూపొందిస్తారట. ఫస్ట్ పార్ట్ 2025 మార్చి 28న విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే డేట్ కు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ అంటే సితార బ్యానర్ కు స్పెషల్ రెస్పెక్ట్ కదా. అందుకే పవన్ మూవీ వస్తే విజయ్ సినిమాను పోస్ట్ పోన్ చేస్తాం అంటున్నాడు. అంటే పవన్ వస్తే.. విజయ్ రావడం కుదరదు. అందుకే వాయిదా వేస్తాం అంటున్నారు. ఒకవేళ హరిహర వీరమల్లు చెప్పిన టైమ్ కు రాకపోతే విజయ్ సినిమా ఉంటుందన్నమాట.

ఇక ఈ రెండు భాగాలకు సంబంధించి రెండు సెపరేట్ స్టోరీస్ ఉంటాయని చెప్పాడు. ఈ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ చూసినా ఏ ఇబ్బందీ ఉండదట. కాకపోతే అదే పాత్ర రెండో భాగంలో కొనసాగుతుంది అనుకోవచ్చు. ఈ కథ ప్రాపర్ గానే ఎండ్ అవుతుందన్నాడు నాగవంశీ. మరోవైపు సెకండ్ పార్ట్ తీయకపోయినా ఇబ్బందేం ఉండదు అని చెప్పాడు. అంటే ఫస్ట్ పార్ట రిజల్ట్ ను బట్టి సెకండ్ పార్ట్ గురించి ఆలోచిస్తారేమో.

భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం చేస్తున్నాడు. ఎలా చూసినా ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ను బట్టి ఈ మూవీ సమ్మర్ లో ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది.

Tags

Next Story