Vedaant Madhavan: ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న సీనియర్ హీరో కుమారుడు..

Vedaant Madhavan (tv5news.in)
Vedaant Madhavan: మామూలుగా సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న ఏ సెలబ్రిటీ అయినా.. తమ వారసులను హీరోలుగా లేదా హీరోయిన్లుగానే చూడాలనుకుంటారు. కానీ చాలా తక్కువమంది మాత్రమే ఈ గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టకుండా వేర్వేరు విభాగాల్లో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇటీవల ఓ స్టార్ హీరో కుమారుడు ఏకంగా ఒలింపిక్స్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.
హీరో మాధవన్.. తెలుగు, తమిళంలో ఒకప్పుడు లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నటుడు. తాను హీరోగా నటిస్తున్న సమయంలో కూడా ట్రై చేయని వెరైటీ పాత్రలను తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ట్రై చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు మాధవన్. ప్రస్తుతం తన సినిమాలతో మాత్రమే కాకుండా ఒక తండ్రిగా కూడా తన కొడుకు వేదాంత్‌ను టాప్‌లో చూడాలని కష్టపడుతున్నాడు మాధవన్.
మాధవన్ కొడుకు వేదాంత్.. జాతీయ స్థాయి స్విమ్మింగ్ ఛాంపియన్. అయితే తనను త్వరలోనే ఒలింపిక్స్‌లో చూడాలని మాధవన్ కోరిక. అందుకే దానికి తగినట్టుగా వేదాంత్‌ను ప్రిపేర్ చేస్తున్నాడు. అయితే ఒలింపిక్స్ కోసం ప్రిపూర్ అయ్యేలా ఇండియాలో స్విమ్మింగ్ పూల్స్ ఏం లేవని ఫ్యామిలీతో సహా దుబాయ్ షిఫ్ట్ అయిపోతున్నాడు మాధవన్.
అయితే మిగతా వారి లాగా తన కొడుకును హీరో చేయడం తమకు ఇష్టం లేదా అని మాధవన్‌ను అడగగా.. తమ కొడుకు హీరో అవ్వాలని తాము ఎప్పుడూ అనుకోలేదని, వేదాంత్‌కు నచ్చిన స్విమ్మింగ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా టైటిల్స్‌ను గెలుచుకుంటూ తల్లిదండ్రులుగా తమను గర్వపడేలా చేస్తున్నాడని అన్నాడు. అంతే కాకుండా వేదాంత్ హీరో కాకపోవడం వల్ల తానేం బాధపడట్లేదని మాధవన్ తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com