Vedika Fear : ప్రభుదేవా చేతుల మీదుగా "ఫియర్" ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా "ఫియర్". ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు Dr. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ రోజు "ఫియర్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉందన్న ఆయన చిత్ర యూనిట్ కు బెస్ట్ విశెస్ అందజేశారు. ఒక చీకటి గదిలో హీరోయిన్ భయపడుతూ చూస్తున్న స్టిల్ తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన "ఫియర్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com