Katrina Kaif Vicky Kaushal: కత్రినా, విక్కీ పెళ్లిలో మెహందీనే హైలెట్.. దానికి కారణం ఈమే..

Katrina Kaif Vicky Kaushal: కత్రినా, విక్కీ పెళ్లిలో మెహందీనే హైలెట్.. దానికి కారణం ఈమే..
Katrina Kaif Vicky Kaushal: ఒకప్పుడు పెళ్లి అంటే చాలా సింపుల్‌గా.. ఎక్కువ హంగు, ఆర్భాటం లేకుండా జరిగిపోయేవి.

Katrina Kaif Vicky Kaushal: ఒకప్పుడు పెళ్లి అంటే చాలా సింపుల్‌గా.. ఎక్కువ హంగు, ఆర్భాటం లేకుండా జరిగిపోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. పెళ్లి కంటే ముందు జరగాల్సినవి చాలా ఉన్నాయి. కుటుంబం అంతా కలిసి కనీసం వారం రోజులు ఎంజాయ్ చేసేలా పెళ్లిళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిలో భాగంగానే సంగీత్, మెహందీ లాంటివి ఈరోజుల్లో హైలైట్ అవుతున్నాయి. తాజాగా కత్రీనా, విక్కీ కౌశల్ పెళ్లికి కూడా అదే హైలైట్ అయ్యింది.

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి గురించి బాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. వారి పెళ్లి ఫోటోలు ఎప్పుడెప్పుడు బయటికి వస్తాయా అని ఇప్పటికీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారు. ఫోటోలు రాకపోయినా.. వీరి పెళ్లి గురించి ఏదో ఒక వార్త బయటికి వచ్చి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా వీరి మెహందీ గురించి బయటికొచ్చిన ఓ వార్త కూడా ఇలాగే వైరల్ అవుతోంది.

ఈమధ్య ఎవరి పెళ్లి అయినా.. మెహందీ మీద బాగా దృష్టి పెడుతున్నారు. అందులోనూ సెలబ్రిటీ పెళ్లి అంటే మినిమమ్ ఉండాలి కదా. అందుకే కత్రినా మెహందీ కోసం మెహందీ క్వీన్‌ వీణా నాగాదాను రంగంలోకి దింపారట. గుజరాత్‌లో పుట్టిన వీణా.. తన తండ్రి పై చదువులకు ఒప్పుకోకపోవడంతో మెహందీ డిజైన్స్‌కు నేర్చుకోవడం మొదలుపెట్టింది. అతి కొద్దికాలంలోనే మంచి మెహందీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంది.

అలా వీణా పేరు సెలబ్రిటీల వరకు వెళ్లింది. హృతిక్‌ రోషన్, సుసాన్నే పెళ్లిలో వీణా పెట్టిన మెహందీ హైలైట్‌గా నిలిచింది. దీంతో తన వద్దకు సెలబ్రిటీ కస్టమర్లు రావడం మొదలయ్యింది. దాదాపు పదుల్లో బాలీవుడ్ సెలబ్రిటీల మెహందీకి హైలైట్‌గా నిలిచింది వీణా నాగాదా డిజైన్సే. బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు వీణాకు ఎంతోమంది ఫారిన్ కస్టమర్లు కూడా ఉన్నారు.

వీణా మెహందీ డిజైన్లకు ఇంప్రెస్ అయిన బాలీవుడ్ దర్శక నిర్మాతలు తనతో కలిసి సినిమాలు కూడా చేశారు. పలు ఈవెంట్ల కోసం కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా వీణా మెహందీ వేశారు. వీణా ఆదాయం ఎంతో కరెక్ట్‌గా తెలియకపోయినా.. ఈ సెలబ్రిటీ కస్టమర్ల వల్ల తాను బాగానే సంపాదిస్తుందని సమాచారం. ఇప్పటికీ దాదాపు 55 వేలమంది వీణా దగ్గర మెహందీ నేర్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story