Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఐటెం సాంగ్.. మా బావ కుమ్మేసాడు: డైరెక్టర్ గోపీచంద్
Veera Simha Reddy Item Song: నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమోలు, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
టైటిల్ సాంగ్ జై బాలయ్య, రెండో సింగిల్ సాంగ్ సుగుణ సుందరి పాటలకు మంచి ప్రేక్షకాదరణ దక్కడంతో.. ఈ సినిమా నుంచి మరో సాంగ్ అప్డేట్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి థర్డ్ సింగిల్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారుట. అయితే ఈ సాంగ్ లో బాలయ్య రచ్చ మామూలుగా ఉండదని డైరెక్టర్ కూడా చెప్పేయడంతో మరింత ఆసక్తిగా ఈ పాట కోసం చూస్తున్నారు ఆడియన్స్.
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహా రెడ్డి గా సంక్రాంతి బరిలో జనవరి 12న వస్తున్నాడు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంలో ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఫస్ట్ లుక్, వీడియోల్లో పక్కా మాస్ గెటప్ తో ఆకట్టుకున్నారు బాలయ్య. అలాగే జై బాలయ్య టైటిల్ సాంగ్ తో పాటు రీసెంట్ గా వచ్చిన సుగుణ సుందరి పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలోనే మరో పాటతో రాబోతోంది మూవీ టీమ్.
ఈ సారి ఓ ఐటమ్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు టాక్.ఈ నేపథ్యంలో డిసెంబర్ 25న వీరసింహారెడ్డి మూవీ నుండి ఐటమ్ పాట విడుదల అవుతుందంటూ... ఒక ఫ్యాన్ చేసిన పోస్ట్ కి... డైరెక్టర్ గోపీచంద్ రియాక్ట్ అయ్యాడు.
ఈ సాంగ్ మాములుగా ఉండదని.. మా బావ థమన్ కుమ్మేసాడంటూ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు ఆ సాంగ్ వినడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ ని రామజోగయ్యశాస్త్రి రాయగా.. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు. ఈ సాంగ్ లో బాలయ్య మాస్ స్టెప్పులతో ఇరగదీశాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మరీ ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com