Veera Simha Reddy: జోష్‌లో బాలయ్య.. హనీరోజ్‌తో పార్టీ..

Veera Simha Reddy: వీరసింహారెడ్డి విజయం నందమూరి బాలకష్ణకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. అఖండ బ్లాక్ బస్టర్, వీరసింహరెడ్డి సూపర్ సక్సెస్.. సిల్వర్ స్క్రీన్‌పై వరుస విజయాలు.. అటు బుల్లి తెరపై కూడా అన్‌స్టాపబుల్ ఆహాలో దూసుకుపోతోంది.
వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలను చిత్ర యూనిట్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించింది. బాలకృష్ణతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇంకా ఈ కార్యక్రమానికి యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సక్సెస్ మీట్ తర్వాత టీమ్ పార్టీ చేసుకుని ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. పార్టీకి సంబంధించిన కొన్ని చిత్రాలను విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ఈ చిత్రాలలో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించని చిత్రం బాలకృష్ణ తన కో స్టార్ హనీ రోజ్‌తో కలిసి డ్రింక్ సేవిస్తున్న దృశ్యం. ఈ హ్యాపీ మూమెంట్ పిక్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీరసింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ కీలక పాత్ర పోషించింది. ఆమె నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com