ఎన్ని సినిమాలు పోటీ వచ్చినా 'రాజా' చిత్రం సూపర్ హిట్.. కానీ ఆ ఒక్క సినిమా..

విక్టర్ వెంకటేష్ కెరీర్‌లో క్లాసికల్ మూవీగా తెరకెక్కి అటు క్లాస్‌ని ఇటు మాస్‌ని విశేషంగా అలరించిన రాజా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంలో వెంకీ సరసన సౌందర్య నటించింది. ముప్పలనేని శివ దర్శకత్వంలో 1999 మార్చి 18న వచ్చిన ఈ చిత్రం రజతోత్సవం చేసుకుంది.
ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్. మొదటి వారం కోటి 89 లక్షల షేర్‌ని కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. అయితే ఈ చిత్రానికి పోటీగా వచ్చిన చిత్రం.. రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ జంటగా నటించిన చిన్ని చిన్ని ఆశ మూవీ రేలంగి నరసింహారావు డైరెక్షన్‌లో వచ్చి డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
అప్పుడే వచ్చిన మరో చిత్రం శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన ఇంగ్లీష్ పెళ్లాం, ఈస్ట్ గోదావరి మొగుడు.. సురేష్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కూడా యావరేజ్‌గా ఆడింది. ఇక రాజా సినిమాకు వారం రోజులు ముందు కోడిరామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన దేవీ చిత్రం అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాజా ప్రభావం నుంచి తప్పించుకుని మరీ హిట్ కొట్టింది.
ఇక అదే సమయంలో వచ్చిన మరో చిత్రం తులసి కుమార్ డైరెక్షన్‌లో జెడి చక్రవర్తి, రాశి జంటగా నటించిన హరిశ్చంద్ర మూవీ మార్చి 12న వచ్చింది. ఇదీ పెద్దగా ఆడలేదు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన చిత్రం యమజాతకుడు చిత్రం కూడా యావరేజ్‌గా ఆడింది. రాజా చిత్రాన్ని బీట్ చేయలేకపోయింది. ఒక దేవీ చిత్రం మాత్రమే రాజాని దాటుకుని ప్రభంజనాన్ని సృష్టించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com