Ajith Vijay: కోలీవుడ్‌లో భారీ మల్టీ స్టారర్.. కాంబినేషన్ సెట్ చేసిన స్టార్ డైరెక్టర్..

Ajith Vijay: మల్టీ స్టారర్ చిత్రాలకు ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉంటుంది. ఒకే స్క్రీన్‌పై, ఒకే సినిమాలో ఇద్దరు హీరోలను చూడడంలో ఉండే కిక్కే వేరు అనుకుంటారు మూవీ లవర్స్. అందుకే స్టార్ హీరోలు సైతం ఈమధ్య మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్‌లో అలాంటి ఒక మల్టీ స్టారర్ లైన్‌లో ఉన్నట్టు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
ఏ భాషా పరిశ్రమ అయినా.. హీరోల మధ్య పోటాపోటీ పోరు ఉంటుంది. హీరోలకంటే ఎక్కువగా వారి అభిమానుల్లోనే పోటీ ఉంటుంది. నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప అని అనుకునేవారు చాలామంది ఉంటారు. అయితే కోలీవుడ్‌లో ఎప్పటికీ కొలిక్కిరాని వివాదం అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నారనే వార్త ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ వెంకట్ ప్రభు.. ఈమధ్య ఓ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు అజిత్, విజయ్‌లతో మల్టీస్టారర్ చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. అంతే కాకుండా దానికి కథ కూడా సిద్ధంగా ఉందన్నాడు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే కథను యాక్సెప్ట్ చేస్తారా. వీరిద్దరు కలిసి నటిస్తే ఫ్యాన్స్ ఎంతవరకు సంతోషిస్తారు అనే అంశాలు ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com