బాబాయ్, అబ్బాయ్ మల్టీ స్టారర్..

బాబాయ్, అబ్బాయ్ మల్టీ స్టారర్..
ఓటీటీ అనేది వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ లకు ఉన్న డిమాండ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఓటీటీ అనేది వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ లకు ఉన్న డిమాండ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ అనే ట్రెండ్ ఎప్పుడో మొదలయిపోయినా కూడా ఎంటర్టైన్మెంట్ లవర్స్ వాటిని పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఎప్పుడైతే పెయిడ్ ఓటీటీలు వచ్చి పరభాషలో ఉన్న వెబ్ సిరీస్ లు అన్నీ మనకు అందుబాటులోకి తెచ్చాయో అప్పుడే వాటి లెవెల్ అమాంతం పెరిగిపోయింది.

ఓటీటీ అనేవి వెబ్ సిరీస్ లకు మాత్రమే కాదు చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా మంచి ప్లాట్ ఫార్ములుగా నిలుస్తున్నాయి. అందుకే స్టార్ హీరోతో మొదలుపెట్టి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఓటీటీలో అడుగుపెట్టడానికి విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఎందరో హీరోహీరోయిన్లు ఓటీటీలోకి ఎంటరయ్యి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను చేస్తూ రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి దగ్గుబాటి హీరోలు చేరబోతున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ కు ఎంత పేరొచ్చిందో.. అంతకు సమానంగా గుర్తింపును అందుకున్నాడు బల్లాలదేవ రానా.

ఇప్పుడు ఈ హీరో ఫుల్ డిమాండ్ తో తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. అంతే కాకుండా హోస్ట్ గా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాడు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో పవర్ స్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ దగ్గుబాటి హీరో తన బాబాయ్ వెంకటేశ్ తో కూడా కలిసి నటించడానికి సిద్ధమవుతున్నాడు. వెంకటేశ్, రానా కలిసి నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు అనే వెబ్ సిరీస్‌‌కు సైన్ చేసారు. ఇటీవల ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్ టీమ్. ఈ అప్డేట్ తో దగ్గుబాటి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story