Venkatesh : బంధుమిత్రుల అభినందనలతో వెంకటేష్

Venkatesh :  బంధుమిత్రుల అభినందనలతో వెంకటేష్
X

వెంకటేష్ మరోసారి మంచి టైటిల్ పట్టేసుకున్నాడు. ఇంతకు ముందు సంక్రాంతికి వస్తున్నాం అనేశాడు. ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్ గా మారిందా చిత్రం. ఇప్పుడు బంధుమిత్రుల అభినందనలతో అంటున్నాడు. సంక్రాంతికి మించిన బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపించేలా ఈ సారి త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నాడు వెంకీ. కాకపోతే ఇంకా ఆ టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. బట్ టైటిల్ మాత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే అని చెబుతున్నారు.

త్రివిక్రమ్ అల వైకుంఠపురములో మూవీ తర్వాత మరే సినిమా చేయలేదు. ఈమూవీ తర్వాత ఎన్టీఆర్ తో చేయాల్సి ఉంది. బట్ ఆగిపోయింది.తర్వాత అల్లు అర్జున్ కూడా సీన్ లోకి వచ్చాడు. బట్ అల్లు అర్జున్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఈ టైమ్ లో వెంకటేష్ తో మూవీ చేయడం మాత్రం విశేషం అనే చెప్పాలి. మధ్యలో ఎన్టీఆర్ తో పౌరాణిక చిత్రం కూడా చేయబోతున్నాడు. అందుకు కాస్త టైమ్ ఉంది. ఈ గ్యాప్ లో వెంకటేష్ తో బంధుమిత్రుల అభినందనలతో మూవీ చేయబోతున్నాడు.

ఇక ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే చెబుతున్నారు. హీరోయిన్ తో పాటు ఇతర కాస్టింగ్ ఎవరు అనేది ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేష్ .. మన శంకరవర ప్రసాద్ గారు మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ తో మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు. ఇందుకోసం పెద్ద టైమ్ కూడా తీసుకోబోవడం లేదని టాక్. మొత్తంగా ఈ బంధుమిత్రుల అభినందనలతో మూవీ టైటిల్ మాత్రం త్రివిక్రమ్ తో పాటు వెంకటేష్ శైలిలోనే చాలా బావుంది అనుకోవచ్చు.

Tags

Next Story