Trivikram Srinivas : వెంకటేష్, త్రివిక్రమ్ టైటిల్ ఇదే

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ లాంటి మూవీ అంటే అంతా నువ్వు నాకు నచ్చావ్ గురించే చెబుతారు. ఆ మూవీ డైలాగ్స్ కు ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ పంచ్ లను అందించింది అప్పట్లో కేవలం రైటర్ గానే ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత త్రివిక్రమ్ డైలాగ్స్ తోనే వచ్చిన మల్లీశ్వరి కూడా సూపర్ హిట్ అయింది. మల్లీశ్వరికి ముందే త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాడు. అందకే అప్పటి నుంచి ఆయన వెంకటేష్ తో సినిమా చేయాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. చాలా ఆలస్యం అయినా ఫైనల్ గా వీరి కాంబోలో సినిమా రాబోతోంది. హారిక హాసిని బ్యానర్ లో రూపొందబోతోన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది.
ఇక ఈ మూవీకి త్రివిక్రమ్ శైలిలోనే ఓ మంచి టైటిల్ ను పెట్టారు అని టాక్. ఇప్పటికి వినిపిస్తోన్న దాన్ని బట్టి వెంకీ మూవీకి ‘వెంకట రమణ’ అనే టైటిల్ ఫిక్స్ చేశాడట త్రివిక్రమ్. కొన్నాళ్లుగా అచ్చ తెలుగు టైటిల్స్ తో ఆకట్టుకుంటున్నాడు త్రివిక్రమ్. ఈ టైటిల్ కూడా వెంకీకి సరిపోయేలా ఉంటుంది. అలాగే కథకూ సెట్ అవుతుందట. అందుకే వెంకట రమణ అని పెట్టారంటున్నారు. విశేషం ఏంటంటే.. త్రివిక్రమ్ లాస్ట్ మూవీ గుంటూరు కారంలో హీరో మహేష్ బాబు పేరు కూడా వెంకట రమణ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటోందీ మూవీ. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో మూవీ ఆగిపోవడంతోనే ఈ కాంబో సెట్ అయింది. ఏదేమైనా అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న కాంబినేషన్ ఇది. అంచనాలు కూడా బాగా ఉంటాయి. వాటని అందుకునేలా త్రివిక్రమ్ పంచ్ లకు వెంకీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com