Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం అని ఫిక్స్ అయిన వెంకీ అండ్ టీమ్

Venkatesh :  సంక్రాంతికి వస్తున్నాం అని ఫిక్స్ అయిన వెంకీ అండ్ టీమ్
X

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మూడో సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. అంతా ఊహించినట్టుగానే ఈ చిత్రానికి '' సంక్రాంతికి వస్తున్నాం" అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. దీంతో పాటు ఈ మూవీ 2025 సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటుంది అనే ఊహాగానాలకు కూడా చెక్ పెట్టారు. టైటిల్ లోనే 2025 సంక్రాంతికి వస్తున్నాం అని క్లియర్ గా మెన్షన్ చేశారు. దీంతో ఈ మూవీ రేస్ లోనే ఉందని తేలిపోయింది.


వెంకీ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. చీరలో ఐశ్వర్య, జీన్స్, బ్లాక్ జాకెట్ తో మీనాక్షి ఉండగా ఇద్దరి మధ్య లుంగీ కట్టుకుని ఓ పెద్ద గన్ పట్టుకుని ఉన్నాడు వెంకటేష్. దీన్ని బట్టి ఇది మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

ఇక వెంకీ - అనిల్ కాంబోలో ఇంతకు ముందు వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీస్ హిలేరియస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ గా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీపైనా అంచనాలున్నాయి. వాటిని అందుకుంటే ఈ కాంబోలో హ్యాట్రిక్ కంప్లీట్ అవుతుంది.

Tags

Next Story