Venkatesh - Rana : వెంకటేష్, రానా కలిసి కోటి విరాళం, మైత్రీ సైతం

Venkatesh - Rana :  వెంకటేష్, రానా కలిసి కోటి విరాళం, మైత్రీ సైతం
X

వర్షాల ధాటికి తెలుగు రాష్ట్రాలు కుదేలైపోతున్నాయి. నాన్ స్టాప్ గా కురిసిన వర్షాల కారణంగా ఏపి, తెలంగాణలోని పలు జిల్లాల ప్రజల జీవితం అస్తవ్యస్తం అయింది. ఇలాంటి విపత్తులు ఎప్పుడు జరిగినా మన తెలుగు సినిమా పరిశ్రమ వెంటనే స్పందిస్తుంది. తమ వంతుగా ఆర్థిక సాయం చేస్తుంటారు. అభిమానులను కూడా సాయం చేయమని చెబుతుంటారు. ఇప్పటికే టాలీవుడ్ లోని పలువురు టాప్ స్టార్స్ భారీ విరాళాలు ప్రకటించి ఆపన్నులకు అండగా మేమున్నాం అంటూ తమ హీరోయిజాన్ని చూపించారు. ఎవరికి తోచినంత వాళ్లు విరాళంగా ప్రకటిస్తున్నారు.

తాజాగా విక్టరీ వెంకటేష్, రానా కలిసి తమ వంతుగా ఒక కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇది రెండు రాష్ట్రాలకు కలిపి అంటే.. చెరో 50 లక్షలుగా ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రకటించిన వాళ్లంతా కూడా ఇలాగే రెండు రాష్ట్రాలకూ తమ వంతుగా సాయాన్ని అందిస్తున్నారు. అలాగే దగ్గుబాటి కుటుంబం కూడా కోటి రూపాయలతో పెద్ద మనసు చాటుకున్నారు.


వీరితో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు కూడా రెండు రాష్ట్రాలకు చెరో పాతిక లక్షల చొప్పున 50 లక్షలు ప్రకటించారు. ఈ ఇద్దరూ విడుదల చేసిన ప్రకటనల్లో ‘కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మనందరి బాధ్యత అని.. వీలైనంత త్వరగా అందరి జీవితాలు నార్మల్ కావాలని కోరుకుంటున్నట్టుగా ఉంది.



Tags

Next Story