Venkatesh : హోస్ట్‌‌గా వెంకీ.. అల్లు అరవింద్ కొత్త టాక్ షో.. !

Venkatesh : హోస్ట్‌‌గా వెంకీ.. అల్లు అరవింద్ కొత్త టాక్ షో.. !
Venkatesh : వెండితెర పై స్టార్ స్టేటస్‌‌ని చూసిన టాలీవుడ్ సీనియర్ హీరోలు ఇప్పుడు బుల్లితెర పై కూడా తమ హవా చాటుతున్నారు.

Venkatesh : వెండితెర పై స్టార్ స్టేటస్‌‌ని చూసిన టాలీవుడ్ సీనియర్ హీరోలు ఇప్పుడు బుల్లితెర పై కూడా తమ హవా చాటుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున హోస్ట్‌‌గా తమ సత్తా ఏంటో చూపించారు.

ఈ మధ్యే బాలకృష్ణ 'అన్‌‌‌స్టాపబుల్‌' అనే టాక్‌ షోకి హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్నాడు.. ఆహాలో ప్రసారం అవుతున్న ఈ షోకి మాంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆహాలో మరో కొత్త టాక్ షోని ప్లాన్ చేశారట నిర్మాత అల్లు అరవింద్.. ఈ సరికొత్త టాక్‌ షోకి విక్టరీ వెంకటేశ్‌ని హోస్ట్‌గా చేయించడానికి ప్రయత్నిస్తున్నారట ఆయన.

ఇందుకోసం అల్లు అరవింద్... వెంకటేష్ ని కూడా సంప్రదించారని, ఆయన కూడా ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అన్ని కుదిరితే వచ్చే నెలలో ఈ టాక్ షో స్టార్ట్ అవొచ్చునని సమాచారం. కాగా ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా రానాతో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story