Venky Re-Release : రీ రిలీజ్ రెడీ.. వెంకీ మళ్లీ వచ్చేస్తున్నాడు
శ్రీను వైట్ల మాస్ మహారాజా రవితేజ కాంబోలో తెరకెక్కిన సినిమా వెంకీ. 2004లో రిలీజైన ఈ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా హిట్ సినిమాల ను మళ్లీ రిలీజ్ చేసే రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. పెద్ద హీరోల హిట్ సినిమాలు అన్ని దాదాపు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. స్నేహ హీరోయిన్ గా నటించిన ఈ కామెడీ ఎంటర్టైన ర్ లో అశుతోష్ రాణా, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరోసారి రీరిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ సినిమాను గతేడాది డిసెంబర్ 30న థియేటర్ల రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రెండు రోజుల్లో దాదాపు కోటీ తొంభై లక్షల వరకు వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. మరో మారు ఈ నెల 21న రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాల్సిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com