Venu Swamy : బహిరంగ క్షమాపణలు చెప్పిన వేణు స్వామి

Venu Swamy :  బహిరంగ క్షమాపణలు చెప్పిన వేణు స్వామి
X

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల వివాహం సందర్భంగా ఓ ఛానల్ లో ఈ ఇద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు అని.. విడాకులు తీసుకుంటారు అని జోష్యం చెప్పాడు వేణు స్వామి. అంతకు ముందు కూడా అనేకమంది ఫిలిం సెలబ్రిటీస్ పై నోరు పారేసుకుంటూ నోటికి ఏది వస్తే మాట్లాడుతూ నిత్యం వార్తల్లో ఉండాలని ప్రయత్నాలు చేశాడు వేణు. అయితే శుభమా అంటూ పెళ్లై కొన్ని గంటలు కూడా గడవక ముందే నాగ చైతన్య, శోభిత విడిపోతారని చెప్పడంతో అతనిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు వేణు స్వామిపై తెలంగాణ విమెన్ కమీషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని విమెన్ కమీషన్ వేణుస్వామికి నోటీస్ లు పంపించింది. ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టు ఆశ్రయించాడు వేణు స్వామి. అతని అప్పీల్ ను హై కోర్ట్ కొట్టివేసింది. ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది హైకోర్టు.

హై కోర్ట్ తీర్పు నేపథ్యంలో మరోసారి వేణుస్వామికి నోటీస్ లు పంపించింది తెలంగాణ విమెన్ కమీషన్.

దీంతో ఇవాళ (మంగళవారం) కమీషన్ ముందు హాజరయ్యాడు వేణుస్వామి. చేసిన తప్పులు ఒప్పుకున్నాడు. తన తప్పుకు బహిరంగంగా క్షమాపణలు కోరుతూ నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితంపై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు కమీషన్ ముందు తెలియజేశాడు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణు స్వామిని హెచ్చరించింది ఉమెన్ కమిషన్.

మరి ఇకనైనా వేణు స్వామి ఇతరుల వ్యక్తిగత జీవితాల నుంచి వారి పర్మిషన్ లేకుండా బహిరంగంగా చెప్పడం మానుకుంటాడా లేక ఎలుక తోలు లాగా మళ్లీ పునరావృతం చేస్తాడా అనేది చూడాలి. అయితే ఈసారి మళ్లీ అదే మిస్టేక్స్ రిపీట్ అయితే ఖచ్చితంగా కోర్ట్ లోనే శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వేణు స్వామి.

Tags

Next Story