Pushpa : పుష్ప లోని ఈ డైలాగ్‌ని అప్పట్లోనే చెప్పేసిన వేణుమాధవ్.. వీడియో వైరల్... !

Pushpa : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.. అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా సినిమాలోని పాటలు, అల్లు అర్జున్ ఒక భుజం పైకి మరో భుజం కిందకి ఉండే మ్యానరిజం, తగ్గేదేలే అంటూ చెప్పే డైలాగ్ యూత్‌ని కట్టిపడేశాయి.
ఇక ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో "ఈ కాలు నాదే.. ఆ కాలు నాదే.. నా కాలు మీద నా కాలు వేసుకుంటే తప్పేముంది.. నీ ఓనర్ పైన వేసిననా ఏందీ కాలు" అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ విజిల్స్ వేయిస్తుంది. ఈ డైలాగ్‌ను తన అన్న దగ్గర నుంచి ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నానని సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈ డైలాగ్‌ని గతంలో ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు వేణుమాధవ్ చెప్పారు.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుకుమార్ ఈ డైలాగ్‌ను ఇక్కడి నుంచి కాపీ కొట్టి ఉండవచ్చునని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com