కరోనాతో సీనియర్ నటి కన్నుమూత

కరోనాతో సీనియర్ నటి కన్నుమూత

కరోనా కాటుకు సీనియర్ నటి బలయ్యారు. ప్రఖ్యాత మరాఠీ నటి ఆశాలత వబ్‌గావ్కర్ కరోనావైరస్ తో పోరాడుతూ సతారాలోని ఆసుపత్రిలో మంగళవారం మరణించారు. ఆమె వయసు 79 సంవత్సరాలు.. ఆమెకు COVID-19 నిర్ధారణ తరువాత ఆమెను ఐసోలేషన్ లో చేర్చారు కుటుంబసభ్యులు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు.

గోవాలో జన్మించిన నటి ఆశాలత తొలుత కొంకణి, మరాఠీ భాషల్లో వందలాది నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రసిద్ది చెందారు,ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించి మరాఠీ చిత్రాల్లో నటించారు. కాగా ఆశాలత మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌, నటీమణులు షబానా అజ్మీ, రేణుకా సహానే ఆశాలత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదిలావుంటే టెలిసిరియల్ షూటింగ్ సమయంలో ఆమె సంక్రమణ బారిన పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story