Krishnam Raju : కృష్ణం రాజు ఇక లేరు..

Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు..హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలుఉన్నారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమపదించారు. ఆయన 1940 జనవరి 20న పశ్చిమ గోదావరిజిల్లాలో జన్మించారు. తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. కొన్ని దశాబ్దాలపాటు సినీరంగాన్ని ఏలారు. 1966లో చిలకా గోరింక చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టారు.
రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని కృష్ణంరాజు ఫాన్స్ గౌరవ సలహాదారుడు జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్ట్రీ అన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

