సినిమా

VicKat: పెళ్లి తర్వాతే మొదటిసారి.. విక్కీ, కత్రినాపై వైరల్ అవుతున్న రూమర్..

VicKat: బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎక్కడ చూసినా విక్కీ, కత్రినా పెళ్లి గురించే టాపిక్ నడిచింది.

VicKat: పెళ్లి తర్వాతే మొదటిసారి.. విక్కీ, కత్రినాపై వైరల్ అవుతున్న రూమర్..
X

VicKat: బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎక్కడ చూసినా విక్కీ, కత్రినా పెళ్లి గురించే టాపిక్ నడిచింది. సోషల్ మీడియాకు, ప్రేక్షకులకు తెలియకుండా పెళ్లి చేసుకుందామనుకున్న ఈ ఇద్దరు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే చివరి నిమిషం వరకు వీరిద్దరి పెళ్లికి సంబంధించిన సమాచారం ఏదీ బయటికి రాలేదు. అయితే పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో వీరి గురించే హాట్ టాపిక్ నడుస్తోంది.

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఇద్దరివి రెండు వేర్వేరు ప్రపంచాలు. కేవలం స్క్రీన్‌పైనే చూసి కత్రినాను ఇష్టపడడం మొదలుపెట్టాడు విక్కీ. తాను పెద్ద హీరో అయిన తర్వత కూడా కత్రినానే తన క్రష్‌గా భావించాడు. అలా అప్పుడప్పుడు మాత్రమే కలుసుకున్న వీరిద్దరు అతి తక్కువకాలంలోనే ప్రేమలో పడి, పెళ్లి పీటలెక్కేశారు. ఇక వీరి పెళ్లి ఫోటోలు అయితే సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్‌ను సృష్టించాయి.

పెళ్లికి ముందు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అయితే పెళ్లితో వీరిద్దరి పాపులారిటీ సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోవడంతో వరుసగా సినిమా ఛాన్సులు వీరి తలుపు తడుతున్నాయి. అయితే వీటిలో విక్కీ, కత్రినా ఒక మంచి కథను ఎంచుకున్నారని త్వరలోనే వెండితెరపై కలిసి కనిపించనున్నారని టాక్ నడుస్తోంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES