Vicky Kaushal : విక్కీ, రష్మికల ఛావా రిలీజ్ డేట్ మళ్లీ మారింది

Vicky Kaushal :  విక్కీ, రష్మికల ఛావా రిలీజ్ డేట్ మళ్లీ మారింది
X

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా రూపొందిన సినిమా ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని దినేష్ విజన్ నిర్మించాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఛావాను డిసెంబర్ 6న విడుదల చేయాలనుకున్నారు. ఆ డేట్ లో అప్పుడు పుష్ప 2 ఉంది. రెండు సినిమాలను పోల్చి చూస్తే పుష్ప 2కు ఎక్కువ క్రేజ్ కనిపించింది. దీంతో ఛావాను డిసెంబర్ 6 నుంచి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

ఛావా కొత్త డేట్ గా జనవరి 10 అని వినిపించింది. బట్ ఆ టైమ్ లో గేమ్ ఛేంజర్ తో పాటు సౌత్ లో గట్టి పోటీ కనిపిస్తోంది. ఇదీ కరెక్ట్ కాదనుకున్నారేమో.. మేకర్స్ తాజాగా కొత్త డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 19న ఛావాను విడుదల చేయబోతున్నట్టు కొత్త డేట్ అనౌన్స్ చేశారు. ఆ టైమ్ కు ఇక్కడ పెద్దగా పోటీ లేదు.

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ కథగా ఛావా మూవీ తెరకెక్కింది. హిస్టారికల్ మూవీగా రూపొందిన ఛావాలో ఔరంగజేబ్ పాత్ర కీలకంగా కనిపించబోతోంది. ఈ పాత్ర కోసం మాజీ హీరో అక్షయ్ ఖన్నాను తీసుకున్నారు. మరో మాజీ హీరో సునిల్ శెట్టి కృష్ణవాసుదేవ్ యాదవ్ పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తంగా రెండు తెలుగు సినిమాల వల్ల రెండు సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ మూవీని ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అందుకే వాయిదాల పర్వం సాగుతోంది. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Next Story