Shyam Kaushal Sweet Note: వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. విక్కీ తండ్రి స్పెషల్ విషెస్: నెటిజెన్స్ ఫిదా

Shyam Kaushal Sweet Note: వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. విక్కీ తండ్రి స్పెషల్ విషెస్: నెటిజెన్స్ ఫిదా
Shyam Kaushal Sweet Note:

Shyam Kaushal Sweet Note: ఏ వివాహ బంధం అయినా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవిస్తేనే ఆ బంధం నిలబడుతుంది. అది ఏ రంగంలో ఉన్న వారికైనా వర్తిస్తుంది. ఒకరు ఎక్కువ అనే అంశాలకు తావు ఇవ్వకుండా ఒకరికి ఒకరు తోడు నీడగా నిలబడితే వారితో పాటు వారి కుటుంబాలు సంతోషిస్తాయి. ఇప్పుడు అదే ఆనందాన్ని పొందుతున్నారు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్.


బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఇష్టపడే జంటలలో ఒకరైన కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ ఈరోజు తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వివాహం జరిగే నాటికి కత్రినా బాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన నటి. విక్కీ ఇప్పుడే తన కెరీర్‌లో దూసుకుపోతున్నాడు.




అతని నటన అభిమానుల హృదయాలను గెలుచుకున్నప్పటికీ, కత్రినా కైఫ్‌ను పెళ్లి చేసుకుంటానని విక్కీ కూడా అనుకోలేదు. చూస్తుండగానే వారి వివాహం జరిగి ఏడాది అయిపోయింది. వార్షికోత్సవం సందర్భంగా ఈ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన శుభాకాంక్షలు విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్‌వి.



శ్యామ్ కౌశల్ కొడుకు, కోడలికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. పుత్తర్, మీరు కుటుంబానికి చాలా ఆనందాన్ని అందించారు. మీకు ప్రేమ పూర్వక ఆశీర్వాదాలు." అని రాసుకొచ్చారు. ఇక కత్రినా కైఫ్ కూడా పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆమె తన పోస్ట్‌కి "మై రే ఆఫ్ లైట్ హ్యాపీ వన్ ఇయర్" అని క్యాప్షన్ ఇచ్చింది.



విక్కీ కౌశల్ ఇలా వ్రాశాడు, "టైమ్ ఫ్లైస్... కానీ అది మీతో అత్యంత అద్భుతంగా సాగుతోంది. మన వివాహ బంధానికి ఒక సంవత్సరం శుభాకాంక్షలు. నీవుఊహించిన దానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను!"



విక్కీ, కత్రినా వివాహం డిసెంబర్ 9, 2021న రాజస్థాన్‌లో సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. సవాయి మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో జరిగింది. మూడు రోజుల ఉత్సవాల్లో హల్దీ మరియు సంగీత్‌తో సహా అనేక వేడుకలు అనేక ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story