Ajith Kuamr : అజిత్ సినిమాపై నిర్మాత అసంబద్ధ వాదన

తమిళ్ టాప్ స్టార్ అజిత్ కుమార్ మూవీ అంటే అక్కడ ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. అయితే అజిత్ ఫ్యాన్స్ కు విజయ్ ఫ్యాన్స్ కు మధ్య నిరంతరం సోషల్ మీడియాలో వార్ జరుగుతూ ఉంటుంది. తెలుగు ఫ్యా న్స్ కంటే అసహ్యంగా తిట్టుకుంటారు. మీమ్స్ క్రియేట్ చేస్తుంటారు వాళ్లు. ఈ క్రమంలో ప్రస్తుతం అజిత్ నటిస్తోన్న ‘విడాముయర్చి’ అనే సినిమా 1997లో వచ్చిన ‘బ్రేక్ డౌన్’ అనే హాలీవుడ్ మూవీకి ఫ్రీమేక్ అని తేల్చి దానిపై విమర్శలు మొదలయ్యాయి. బ్రేక్ డౌన్ సినిమానే కాపీ కొట్టి వీళ్లు తీస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ.
ఈ మూవీలో అజిత్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. అర్జున్, రెజీనా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో మగిల్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఓ టాప్ స్టార్ సినిమా కాపీ అంటే ఖచ్చితంగా డామేజ్ అవుతుంది కదా. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ కాస్త జాగ్రత్త తీసుకున్నామని చెబుతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జాగ్రత్త అంటే సింపుల్ గా మేం కాపీ కొట్టడం లేదు.. ఇన్స్ స్పైర్ అయ్యాం అంటారు కదా.. ఇదీ అలాంటిదే. కాకపోతే విమర్శలు ఎక్కువవడంతో.. వాళ్లు చెబుతున్నది ఏంటంటే.. ‘అంతా అంటున్నట్టుగా మేం మొదట ఆ సినిమా నుంచి ఇన్స్ స్పైర్ అయ్యే ఈ కథను మొదలుపెట్టాం. కొన్నాళ్లు షూటింగ్ చేసిన తర్వాత ఇది అచ్చంగా బ్రేక్ డౌన్ లానే కనిపిస్తుందని అర్థమైంది. అందుకే మూడు నెలల క్రితమే రీమేక్ రైట్స్ తీసుకున్నాం..’ ఇదీ విమర్శకులకు వీరు ఇచ్చిన సమాధానం.
బట్ ఏ మాత్రం తెలివి ఉన్నా.. ఇదో అసంబద్ధమైన వాదన అన్న విషయం అర్థం అవుతుంది. ఎందుకంటే.. కొన్నాళ్ల షూటింగ్ తర్వాత బ్రేక్ డౌన్ లా అనిపించడంఏంటో మరి. పైగా అనిపించిన కారణంగానే రీమేక్ రైట్స్ తీసుకున్నారట. అంటే హీరోకు, నిర్మాతలకు కథ చెప్పినప్పుడు ఈ విషయం తెలియదా. ప్రతి సీన్ గురించి తెలుసుకున్న తర్వాతే కథ సినిమా మొదలవుతుంది. అలా కాకుండా కొన్నాళ్ల షూటింగ్ తర్వాత అలా అనిపించడం ఏంటో కానీ.. ఈ వివరణపై కూడా విమర్శలు వస్తున్నాయి అక్కడ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com