Pragathi: 'ఊ అంటావా ఊఊ అంటావా' పాటకు ప్రగతి స్టెప్పులు.. వీడియో వైరల్.

Pragathi (tv5news.in)
X

Pragathi (tv5news.in)

Pragathi: తాజాగా ప్రగతి కూడా జిమ్‌లో ‘ఊ అంటావా’ పాటకు స్టెప్పులేసింది.

Pragathi: పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెమ్ సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ పాట వల్ల, అందులో సమంత డ్యాన్స్ వల్ల ఈ పాట క్రేజ్ అమాంతం ఆకాశానికి వెళ్లిపోయింది. ఈ పాట విడుదలయిన దగ్గర నుండి ఎంతోమంది డ్యాన్సర్లు, ఆర్టిస్టులు దీనికి డ్యాన్సులు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో సీనియర్ నటి కూడా చేరింది.

'ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ' పాట విడుదలయిన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. వీడియో సాంగ్ రిలీజ్ అవ్వకముందే లిరికల్ సాంగ్‌కే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ పాట సినిమాకు చాలా ప్లస్‌గా మారింది. అప్పటినుండి ఎక్కడ ఏ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరగాలన్నా ఈ పాట ఉండాల్సిందే అన్న పరిస్థితి ఏర్పడింది.

సీనియర్ నటి ప్రగతి.. ఒకవైపు సినిమాల్లో హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా నటిస్తూనే.. మరోవైపు ఆఫ్ స్క్రీన్‌లో ఇంకా హాట్ బ్యూటీనే అనిపించుకుంటూ ఉంటుంది. తాజాగా ప్రగతి కూడా జిమ్‌లో 'ఊ అంటావా' పాటకు స్టెప్పులేసింది. అంతే కాకుండా ఈ వీడియోను తన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియో చూసిన కుర్రకారంతా మరోసారి ప్రగతికి ఫ్యాన్స్ అయిపోతున్నారు.


Tags

Next Story