Shah Rukh Khan's Jawan : టికెట్ డబ్బులు వాపస్ కోరిన ఫ్యాన్స్.. ఎందుకంటే
షారుఖ్ ఖాన్ మూవీ 'జవాన్' చూడటానికి వెళ్లిన తర్వాత కొంతమంది సినీ ప్రేక్షకులు తమ ప్రతికూల అనుభవాన్ని పంచుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సహర్ రషీద్ అనే మేకప్ ఆర్టిస్ట్ షేర్ చేసిన ఈ వీడియో, పొరపాటున సినిమా సెకండాఫ్ ను థియేటర్‌లో చూపించడంతో ఆమె, ఆమెతో పాటు ఆడిటోరియంలో ఉన్న ఇతర వ్యక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో సహర్ టికెట్ నగదును వాపసు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
'జవాన్' థియేటర్లలో విడుదలైన రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 9న సహర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. సహర్ తన టిక్కెట్‌లను చూపడంతో వీడియో స్టార్ట్ అయింది. షారూఖ్ -నటించిన ఈ మూవీని మొదటి రోజు మొదటి షో చూడటానికి ఆమె చాలా ఉత్సాహంగా ఉందని టెక్స్ట్ చెబుతుంది. ఒక మాంటేజ్ అప్పుడు థియేటర్‌లో సహర్, ఆమె భాగస్వామిని.. స్క్రీన్‌పై సినిమా కొన్ని సీన్స్ ను చూపుతుంది. అప్పుడు దీనిపై “సినిమా మమ్మల్ని ట్రోల్ చేసింది” అనే టెక్ట్స్ రావడం చూడవచ్చు.
సహర్ ఈ వీడియోలో మాట్లాడుతూ, “సినిమా మొదట రెండవ భాగాన్ని ప్లే చేశారు. ఒక గంట 10 నిమిషాల్లో సినిమాను పూర్తి చేసి ఇంటర్వెల్ అని చెప్పారు. విలన్ అంతం చేసేశాడు కాబట్టి ఇప్పుడు ఇంటర్వెల్ ఎలా ఉంటుందో అనుకున్నాం. అప్పుడర్థమైంది వారు మొదటి భాగాన్ని వేయలేదని" అని చెప్పింది. టిక్కెట్ విండో దగ్గర పెద్ద సంఖ్యలో వ్యక్తులు నిలబడి ఉన్నట్లు వీడియో చూపిస్తుంది. సహర్ తో పాటు మిగతా వారంతా నగదు వాపసు కోసం ఉన్నారని చెప్పారు.
ఈ వీడియోలోని సహర్ కు, ఇతర సినీ ప్రేక్షకులకు మద్దతు వెల్లువెత్తింది. దీనికి మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. "ఈ రోజు ఇంటర్నెట్‌లో ఇది చాలా విచారకరమైన విషయం" ఒకరు కామెంట్ చేయగా.. “మీరు మిస్ అయిన అనుభవానికి రీఫండ్ విలువైనది కాదు, భారతదేశంలో నిర్మించిన అత్యుత్తమ చలనచిత్రాలలో ఒకదానిని నాశనం చేసినందుకు వారిపై దావా వేయండి” అని చాలా మంది సూచించారు.
అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్'లో నయనతార, విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం ఎక్కువగా సానుకూల సమీక్షలను అందుకుంది. హిందీ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్‌ను నమోదు చేసింది. ఇప్పటికే ఇండియాలో రూ.300 కోట్లు రాబట్టి మొదటి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లలోపే వసూళ్లు రాబట్టింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com