Vignesh Shivan About His Wedding With Nayanthara: నయనతారతో పెళ్లి.. స్పందించిన విఘ్నేష్

Vignesh Shivan About His Wedding With Nayanthara: విఘ్నేష్ ఈ రోజు జూన్ 7 న మీడియాను కలుసుకుని నయనతారతో తన వివాహాన్ని అధికారికంగా ప్రకటించాడు. కత్తువాకుల రెండు కాదల్ దర్శకుడు విలేకరులతో మాట్లాడుతూ.. తాము మొదట తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. అయితే లాజిస్టిక్స్ సమస్యల కారణంగా పెళ్లి వేదికను మార్చాలని నిర్ణయించుకున్నారు.
మంగళవారం మీడియాతో సమావేశమైన విఘ్నేష్ శివన్, జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో తాను ప్రేమించిన నయనతారతో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. వివాహానికి సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు హాజరవుతారని తెలిపారు.
తొలుత తిరుపతి దేవస్థానంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే అక్కడ లాజిస్టిక్స్ సమస్యలు ఉన్నాయి కాబట్టి మా కుటుంబాలను తిరుపతికి తీసుకురావడం కష్టంగా ఉంది. అందుకే పెళ్లి వేదికను చెన్నైలోని మహాబలిపురం మార్చాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పారు.
2015 లో నానుమ్ రౌడీ ధాన్ షూటింగ్ సమయంలో నయనతార, విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు . ఈ జంట ఆరు సంవత్సరాల పాటు డేటింగ్ చేసారు. జూన్9న పెళ్లితో ఒక్కటవనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com