Vijay Rashmika: త్వరలోనే విజయ్, రష్మిక పెళ్లి..? ముంబాయిలో కలిసి చక్కర్లు..

Vijay Rashmika: త్వరలోనే విజయ్, రష్మిక పెళ్లి..? ముంబాయిలో కలిసి చక్కర్లు..
Vijay Rashmika: విజయ్, రష్మిక ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు

Vijay Rashmika: సినీ పరిశ్రమలో నటీనటులు సన్నిహితంగా ఉంటే చాలు.. ఇక వారి ప్రేమ, పెళ్లిపై రూమర్స్ వచ్చేస్తాయి. వారు కలిసి ఎక్కడైనా కనిపిస్తే.. డేటింగ్ మొదలుపెట్టేశారని కథనాలు ప్రచురితమవుతాయి. అందులో కొంతవరకు నిజాలు ఉన్నా.. కొన్ని మాత్రం రూమర్స్ వరకే పరిమితమవుతాయి. అలాగే టాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రేమ పక్షులు అనిపించుకుంటున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక. అయితే వీరిద్దరు గురించి తాజాగా మరో రూమర్ కూడా వైరల్‌గా మారింది.


'గీతా గోవిందం' అనే సినిమాలో మొదటిసారిగా విజయ్ దేవరకొండ, రష్మిక మందనా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. అప్పటినుండే చాలామందికి వీరు ఫేవరెట్ ఆన్ స్క్రీన్ పెయిర్‌గా మారిపోయారు. ఇక ఆ మూవీ తర్వాత వెంటనే 'డియర్ కామ్రేడ్' చిత్రంలో కలిసి నటించారు విజయ్, రష్మిక. అప్పటినుండి వీరు ప్రేమలో ఉన్నారంటూ కథనాలు మొదలయ్యాయి.


విజయ్, రష్మిక ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు. అందుకే వీరు ప్రేమలో ఉన్నారని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ వీరిద్దరు కేవలం ఫ్రెండ్ అని కూడా క్లారిటీ ఇచ్చేశారు ఈ గీతా గోవిందం పెయిర్. కానీ 2022 న్యూ ఇయర్‌కు రష్మిక పెట్టిన పోస్ట్ వల్ల విజయ్, రష్మిక ఇద్దరూ కలిసే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారని తెలిసిపోయింది. అప్పటినుండి వీరిపై మరోసారి రకరకాల రూమర్స్ మొదలయ్యాయి.


ఈ ఏడాదిలో విజయ్, రష్మిక పెళ్లి పీటలెక్కనున్నారని రూమర్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం 'లైగర్' షూటింగ్ కోసం విజయ్ ఎక్కువగా ముంబాయిలోనే గడుపుతున్నాడు. రష్మిక కూడా తన బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం ముంబాయి వెళ్లొస్తూ ఉంది. అక్కడ వీరిద్దరు డేట్స్‌కు వెళ్తున్నారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అందుకే త్వరలో పెళ్లి అన్న కథనాలు కూడా మొదలయ్యాయి. మరి ఈ కథనాలు మీద విజయ్, రష్మిక ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story