Vijay Devarakonda : విజయ్, సామ్ సినిమాకి పవన్ టైటిల్..!

Vijay Devarakonda : విజయ్, సామ్ సినిమాకి పవన్ టైటిల్..!
X
Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే..

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ చిత్రం ఈనెల 21న గ్రాండ్‌గా లాంచ్ కానుందని సమాచారం.. ఈ నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ మెదలుకానుంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ఖుషి సినిమా టైటిల్‌ని విజయ్‌, సామ్ సినిమాకి ఫిక్స్ చేసినట్లుగా సమాచారం..ఇందులో విజయ్‌ ఆర్మీ అధికారిగా కనిపించనున్నట్లు రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి.

సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా కశ్మర్‌లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మజిలీ మూవీ తర్వాత సామ్, శివ నిర్వాణ కాంబోలో మూవీ కావడం, విజయ్ హీరో కావడంతో సినిమా పైన మంచి అంచనాలున్నాయి.

కాగా అటు విజయ్.. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో లైగర్ అనే మూవీని కంప్లీట్ చేశాడు.ఆగస్టులో ఈ మూవీ రిలీజ్ కానుంది. పూరి డైరెక్షన్ లోనే జనగణమన అనే మరో మూవీని కూడా మొదలుపెట్టేశాడు విజయ్ .

Tags

Next Story